రూ.11కే షావోమి స్మార్ట్‌ఫోన్ పొందండి... ఇలా కొనేయొచ్చు చూడండి!

షావోమి… ఇపుడు భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడు అవుతోన్న స్మార్ట్ ఫోన్లలో షావోమి ఒకటి.ఎందుకంటే తక్కువ ధరలలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లలో ఈ కంపెనీ ఒకటి.

 Own Xiaomi Redmi 11 Prime In Just 11 Rupees Details, 11rs, Redmi, Phone, Bumper-TeluguStop.com

అయితే మీరు కూడా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే మీకు ఒక శుభవార్త.కేవలం రూ.11 చెల్లించి మీరు రెడ్‌మి 11 ప్రైమ్ ఇంటికి తీసుకెళ్లొచ్చు తెలుసా? అవును, దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షావోమి అదిరిపోయే ఆఫర్ తీసుకు వచ్చింది.కేవలం రూ.11 కే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు.ఇంత తక్కువ ధరకే ఫోన్ కొనొచ్చా? నిజమేనా? అని సందేహపడుతున్నారా? అయితే ఇక్కడ చూడండి!

Telugu Bumper, Latest, Phone, Redmi, Redmiprime, Ups-Latest News - Telugu

అయితే ఇది కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇంకా ఈ ఆఫర్ పరిమిత కాలమే ఉంటుందని మీరు ఇక్కడ గుర్తించుకోవాలి.ఇపుడు Mi స్టోర్‌లో కేవలం రూ.11తోనే మీరు ఈ రెడ్‌మి 11 ప్రైమ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఇక్కడ మీరు ఒక పని చేయవలసి ఉంటుంది.మొదటగా మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి రూ.11 కట్టివేయాలి.ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని ఇన్‌స్టాల్మెంట్ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.దీని అసలు ధర రూ.11,750. మరోవైపు ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ వస్తోంది.

Telugu Bumper, Latest, Phone, Redmi, Redmiprime, Ups-Latest News - Telugu

అమెజాన్ నుంచి ఇదే రెడ్‌మి 11 ప్రైమ్ బేస్ మోడల్‌ను రూ.14,999కు కాకుండా రూ.11,999కే పొందొచ్చు.ఇక ఫీచర్ల విషయానికొస్తే పెద్ద డిస్‌ప్లే కలిగి ఉండి, 50 MP రియర్ కెమెరా వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అదరగొడుతోంది అని చెప్పుకోవచ్చు.అలాగే మీరు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్ అయితే అదనపు డిస్కౌంట్ వస్తుంది.

అంతేకాకుండా ఎక్స్చేంజ్ డీల్ కూడా సొంతం చేసుకోవచ్చు.పాత ఫోన్ ఇచ్చేసి కొత్త ఫోన్ కొంటే రూ.11,350 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.అయితే మీ పాత ఫోన్ కండీషన్, మోడల్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ ఆధారపడి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube