ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసుపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్ అయిన గౌతమ్ మల్హోత్రా కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో హాజరుపరిచింది.ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించింది ఈడీ.అదేవిధంగా మల్హోత్రాని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాలన్న ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.ఈ నేపథ్యంలో మల్హోత్రాను కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను మార్చి 18వ తేదీని వాయిదా వేసింది.
దీంతో గౌతమ్ మల్హోత్రాను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు.







