హైదరాబాదులో డ్రగ్స్ ముఠానీ అరెస్టు చేసిన పోలీసులు..!!

హైదరాబాదులో డ్రగ్స్ ముఠానీ పోలీసులు పట్టుకోవడం జరిగింది.ముంబై కి చెందిన ఈ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

 Police Arrested A Drug Gang In Hyderabad Hyderabad Police, Drugs, Cp Cv Anand, G-TeluguStop.com

నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 204 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్స్ నీ స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగీ సనా ఖాన్  కీలకం అనీ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈమె పనిచేస్తున్నట్లు తెలిపారు.అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయిలు అపస్మారక స్థితిలోకి వెళ్ళాక లైంగిక దాడి చేస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలియజేయడం జరిగింది.

అంతేకాదు ముంబైలో మరో గ్యాంగ్ ను కూడా అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో రెండు డ్రగ్స్ ముఠాలను పట్టుకున్న పోలీసులు… రాచకొండ పరిధిలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాని అరెస్టు చేయడం జరిగింది.

అరెస్ట్ అయిన నిందితులు పూణేకు చెందిన షేక్ ఫరీద్ మహమ్మద్, ఫైజాన్ గా గుర్తించడం జరిగింది.అయితే పట్టుపడ్డ డ్రగ్స్ విలువ.55 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.త్వరలోనే డ్రగ్స్ కింగ్ పిన్ ను పట్టుకుంటాం అనే సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ సనా ఖాన్ ముంబైలో డ్రగ్స్ గ్రామ్ 3 వేలకు కొనుగోలు చేసి హైదరాబాదులో.అదే గ్రామ్ 7వేలకు అమ్ముతూ.దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ రీతిగా వ్యవహరిస్తుంది.ఆమెపై నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.

త్వరలోనే మిగతా వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube