హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రోటోకాల్ అధికారులకు మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.కండిషన్ లో లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని రాజాసింగ్ చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాహనానికి ప్రోటోకాల్ అధికారులు రిపేర్ చేయించారు.వాహనాన్ని తీసుకు వెళ్లాలని రాజాసింగ్ కు అధికారులు కబురు చేస్తోన్నారు.
అయితే తరుచూ మొరాయిస్తున్న పాత వాహనం తనకు వద్దని రాజాసింగ్ చెబుతున్నారు.కొత్తది కాకపోయినా… కనీసం కండిషన్ లో ఉన్న వాహనం కావాలని తెలిపారు.
ఈ నేపథ్యంలో బలవంతంగా పాత వాహనాన్ని అధికారులు తన నివాసం వద్ద వదిలి వెళితే ప్రగతిభవన్ దగ్గర తగులబెడుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు.







