త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కేంద్ర అధికార పార్టీ బిజెపి ఉంది.దీనికోసం పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన ఎప్పటికప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు తగిన సూచనలు చేస్తున్నారు.
అవసరమైన సందర్భంలో కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణలో పర్యటిస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో బిజెపి బలోపేతం అయితే తప్ప, తెలంగాణలో అధికారంలోకి రాలేము అనే విషయాన్ని పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు.
బూత్ లెవెల్ స్థాయికి పార్టీని తీసుకువెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలనే దిశ నిర్దేశం చేస్తున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తోంది.15 రోజుల్లో 11 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించాలని బిజెపి ప్రణాళిక రచించుకుంది.ఈ నెల 10 నుంచి ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి.అయితే ప్రతిరోజు ఈస్ట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై బీజేపీ హై కమాండ్ దృష్టి సారించింది.
దీనిలో భాగంగా తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సాల్ ను రంగంలోకి దించింది.ఆయన ప్రత్యేక టీమ్ లను నియమించుకున్నారు.
ప్రతిరోజు ఏఏ నియోజకవర్గంలో ఏ స్థాయిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరుగుతున్నాయి ? ఆ సభలను ఎవరు నిర్వహించారు ? ఎంతమంది హాజరయ్యారు ? ఎక్కడెక్కడ నిర్వహించలేదు అనే విషయాలపై సునీల్ బాన్సాల్ టీం ఆరా తీస్తోంది.
ఎప్పటికప్పుడు దీనిపై నివేదికలను ఆయనకు అందిస్తోంది.ప్రతి నియోజకవర్గంలో ముఖ్య అతిథులను పంపించింది.ఉప్పల్, బెల్లంపల్లి , పెద్దపల్లి ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ లు జరగకపోవడంపై బన్సల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మేరకు నిర్వహణ కమిటీ కి ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని , టిక్కెట్ కూడా ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు.పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ లు నిర్వహిస్తున్నామని, జాతీయ నాయకుల నుంచి సామాన్య కార్యకర్త వరకు దీనికి జవాబు దారేననే విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండమని తేల్చి చెప్పారట.
ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగులు ఉండేది కేవలం 15 రోజులైనని ఇప్పుడు కూడా కష్టపడకపోతే ఎలా అంటూ ఆయన కొంతమందికి వార్నింగ్ ఇచ్చారట.ఈ మీటింగుల్లో నేతల పనితీరు ఆధారంగా టికెట్ కేటాయింపులు చేపట్టే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉందట.