ఫ్యామిలీ గొడవలతో కొందరు, ఆర్ధిక ఇబ్బందులతో మరికొందరు, పరీక్షల్లో ఫెయిల్.ప్రేమలో ఫెయిల్.
వరకట్న వేధింపులు.ఇలా కారణాలు ఏమైనప్పటికీ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.
ప్రతి 40 సెకన్లకు ఒకరు.ప్రపంచంలో ఏదో ఒక చోట ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కలిగిస్తున్నా బలవన్మరణాలు ఆగడం లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా సగటున 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారట.15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం సూసైడ్.మరణాల శాతం కూడా ఒక్కో దేశంలో ఒక్కోలా వుందట.
ఇదిలావుండగా రెండేళ్ల తర్వాత అమెరికాలో ఆత్మహత్యల శాతం పెరిగింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.యువ అమెరికన్లు, శ్వేతజాతీయేతర వ్యక్తులలో బలవన్మరణాల రేటు పెరడగడం 2021 తర్వాత ఇదే తొలిసారి.దశాబ్ధాలుగా నల్లజాతి, హిస్పానిక్ అమెరికన్లలో ఆత్మహత్య రేటు చాలా తక్కువగా వుంది.
శ్వేతజాతి వర్గాల్లో ఇది మూడింట ఒక వంతుగా వుంది.అయితే కోవిడ్‌కు ప్రభావితమైన జనాభాలో ఆత్మహత్యల రేటు పెరుగుతోంది.

2018-21 మధ్య నల్లజాతీయులలో ఆత్మహత్యల రేటు 19.2 శాతం పెరిగింది.ప్రతి 1,00,000కి 7.3 నుంచి 8.7కి చేరుకుంది.10 నుంచి 24 ఏళ్ల వయస్సు వున్న నల్లజాతీయులలో ఇది వేగంగా నమోదవుతోంది.ఆ సమూహంలో ఆత్మహత్యల రేటు 36.6 శాతం పెరగ్గా.ప్రతి లక్ష మందికి 8.2 నుంచి 11.2కి చేరుకుంది.ఇక 25 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తుల్లో ఆత్మహత్యల రేట్లు 5 శాతం పెరిగాయి.
నల్లజాతీయులు, హిస్సానిక్, అమెరికన్ ఇండియన్, అలాస్కా స్థానికులలోనూ ఆత్మహత్యల శాతం భారీగా పెరిగింది.స్థానిక అమెరికన్, అలాస్కా ప్రజలలో ఆత్మహత్య రేటు అత్యధికంగా వుంది.వీరిలో ప్రతి లక్ష మందికి 22.3 నుంచి 28.1 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కాగా.హిస్సానిక్ కానీ శ్వేత జాతీయుల్లో మాత్రమే ఆత్మహత్య రేటు తక్కువగా వుంది.ఈ జనాభాలో ప్రతి లక్ష మందికి 18.1 నుంచి 17.4 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.ఇక అమెరికాలో ఆత్మహత్యల సంఖ్య దశాబ్ధాలుగా పెరుగుతూనే వుంది.ఇది 2018లో (48,344) అత్యధిక స్థాయికి చేరుకుంది.కోవిడ్ మహమ్మారి చాలా మందిని ఆత్మహత్య వైపు ప్రేరేపించిందని నిపుణులు చెబుతున్నారు.అయితే 2020లో బలవన్మరణాల సంఖ్య 45,979కి పడిపోవడం గమనార్హం.







