వయ్యారంగా నడక.. మిస్ ఇండియాలు కూడా పనికిరారు.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో మనకు నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు కనిపిస్తుంటాయి.వాటిని చూడగానే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా టక్కున నవ్వు వచ్చేస్తుంది.

 Cat Walk Miss India Is Also Useless Video Viral , Walking, Viral Latest, News V-TeluguStop.com

ఫలితంగా పరిస్థితి మారి, మనకు కొంత ప్రశాంతత నెలకొంటుంది.ముఖ్యంగా జంతువులు, పక్షుల వీడియోలు నెటిజన్లను బాగా అలరిస్తుంటాయి.

కొన్ని రాత్రికి రాత్రే బాగా వైరల్ అవుతుంటాయి.వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ దక్కుతుంటాయి.

అంతగా ప్రజలకు బాగా నచ్చుతాయి.ముఖ్యంగా రోడ్డుపై కనిపించిన ఆసక్తికర దృశ్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటే బాగా వైరల్ అవుతున్నాయి.

ఇదే కోవలో ఓ బాతుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.దీనిని చూడగానే ఎలాంటి వారైనా ఉన్నపళంగా నవ్వేస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ర్యాంపుపై క్యాట్ వాక్ చేసే మోడళ్లను చూసే ఉంటారు.వారు అందమైన డ్రెస్సులు ధరించి, ర్యాంపుపై హోయలు ఒలుకుతూ నడుస్తుంటారు.ఇక రోడ్డుపై కొంత మంది అమ్మాయిలు కూడా చాలా స్టైల్ గా వయ్యారంగా నడుస్తుంటారు.

వారిని చూసి వయ్యారి భామ నీ హంస నడకా అంటూ అబ్బాయిలు కామెంట్ చేస్తుంటారు.ఇదే రీతిలో ఓ బాతు చాలా వయ్యారంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది.

రోడ్డు చివరి వరకు దీని నడక అలాగే ఉంది.చాలా స్టైల్ గా, దర్జాగా క్యాట్ వాక్ చేసుకుంటూ ముందుకు సాగింది.

దీని నడక ముందు క్యాట్ వాక్ చేసే మోడళ్లు కూడా పనికిరారు అనే కామెంట్లు వస్తున్నాయి.ఈ వీడియోను beutefullearth అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.దీనికి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

అది ఖచ్చితంగా ఆడబాబు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube