ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలకు 2023 ఉత్తమ సమయం ఎందుకు?

గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నారైలు ఇండియాలో ఆస్తులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు.ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో కొత్త, అభివృద్ధి చెందుతున్న గృహ నిర్మాణాలు, పెరుగుతున్న ప్రాపర్టీ ధరలతో ఇండియన్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది.

 Why 2023 Is The Best Time For Nris To Invest In India?, Nri News, Nri 2023 Inves-TeluguStop.com

బలహీనమవుతున్న రూపాయి విలువ వల్ల కూడా ఎన్నారైలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.

Telugu Financial, Indians, Nri-Telugu NRI

నిజానికి ఇండియాలో ప్రాపర్టీపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదనపు మనీ సంపాదించవచ్చు.ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆస్తి, అద్దె పెరుగుతుంది.అలానే ఇండియాలో ఒక ప్రాపర్టీ సొంతం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ లభిస్తుంది.

దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం రాదు.అలాగే ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల సరైన లైఫ్‌స్టైల్‌కి నిధులు సమకూర్చుకోవచ్చు.

Telugu Financial, Indians, Nri-Telugu NRI

ఇకపోతే ఎన్నారై ఇన్‌వెస్టర్లు ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ముందు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.వారు స్వదేశంలోని కుటుంబానికి దగ్గరగా ఉండటం, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం లేదా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి ఇన్వెస్ట్ చేయవచ్చు.మొత్తంమీద, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగం కావాలనుకునే ఎన్నారైలు.మాతృభూమితో కనెక్షన్‌ని మళ్లీ కొనసాగించాలని అనుకునే ఎన్నారైలకు భారతదేశంలో ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం.

ఇకపోతే కరోనా లాంటి విపత్తుల వల్ల ఎదురయ్యే ఆర్థిక సమస్యలను ఈ ప్రాపర్టీలతో అధిగమించవచ్చు.ఈ కారణాలన్నిటి వల్ల 2023లో ఇండియాలో ఆస్తులు కొనడం మంచి నిర్ణయం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube