ఆ జానర్ మీదనే ఇంట్రస్ట్ చూపిస్తున్న డైరెక్టర్స్ , స్టార్ హీరోస్ ? మరి ఇంతకీ ఆ జానర్ వెనుక ఉన్న కధ ఏమిటి ?

సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటున్నాయి .ఫార్ములా సినిమాలు అయినా , ఎక్స్పెరిమెంటల్ సినిమా అయినా , థ్రిల్లర్ సినిమా అయినా ,కధలో దమ్ము కొత్తధనం ఉంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు.

 All Directors And Heroes Interested In Gangster Geners Movies Ram Gopal Varma Pr-TeluguStop.com

ఒక్కో డైరక్టెర్ ఒక్కో జానర్ లో సినిమా తీస్తారు.ఇక డైరెక్టర్ తాను అనుకున్న పేపర్ మీద రాసుకున్న స్టోరీ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడమే డైరెక్టర్ పని సినిమా రిజల్ట్ మాత్రం ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.

మరికొందరు దర్శకులు అయితే ఫార్ములా బేస్ సినిమాలు తెరకెక్కించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు.ఒక్కో డైరెక్టర్ తమ టెస్ట్ బట్టి , ప్రేక్షకుల అభిరుచి బట్టి , ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కిస్తారు.

ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలు చూసినట్లు అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ హీరోయిజమ్ ఎలివేషన్స్ , పంచ్ డైలాగ్స్ , మాస్ ఎలిమెంట్స్ , ఒక్క ఫ్యాన్ ఏ విధంగా కోరుకుంటారో అ స్టైల్ లో సినిమాను చూపించడానికి ప్రయత్నిస్తుంటారు.ఇక డైరక్టెర్ కొరటాల శివ స్టయిల్ అయితే సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు .ఇక డైరెక్టర్ కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చి సినిమా నుండి ఇదే ఫార్మేట్ నే ఫాలో అవుతున్నారు.

Telugu Anil Ravipudi, Geners, Directors, Gangster, Heroes, Koratala Siva, Pawan

ప్రస్తుతం డైరెక్టర్స్ కు కమర్షియల్ సినిమా తెరకెక్కించడం ,ఫ్యాన్ బేస్ ఎలిమెంట్స్ తో పాటు ,అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచి గల సినిమాలను తెరెకెక్కించడం అనేది కత్తి మీద సాము లాంటి విషయం.ఏ స్టార్ డైరెక్టర్ సినిమా తీసిన ,యంగ్ డైరెక్టర్ సినిమా తీసిన కధలో కొత్త ధనం ఉంటేనే సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇంట్రస్ట్ గా థియేటర్స్ కు వస్తారు.ప్రస్తతం ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి సీనిమాలు వరుసగా ఎందుకు సక్సెస్ అవుతున్నాయి ? అంటే తాను సెలెక్ట్ చేసుకున్న జానర్ ఇంపార్టెంట్.అనిల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులు కామెడీ తో పాటు ఆ చిన్న ఫన్ ఎలిమెంట్ ఉంటుంది.

Telugu Anil Ravipudi, Geners, Directors, Gangster, Heroes, Koratala Siva, Pawan

ఇక టాలెంటెడ్ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి విషయానికి వస్తే.తన డైరెక్షన్ లో వచ్చిన ఒక్కో సినిమా ఒక్కో జానర్ ,ఇక రాజమౌళి కి జానర్ తో సంబంధం ఉండదు ,స్టోరీ లో ఎమోషన్ ఉంటే చాలు ఆటోమేటిక్ గా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు ఇది రాజమౌళి ఫాలో అయ్యే సిద్ధాంతం.డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ పని చేసిన వాళ్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒక్కసారి టచ్ చేసిన జానర్ మల్లి టచ్ చెయ్యరు.కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఒక్కొకటి ఒక్కో జానర్ లో ఉంటాయి .కెరీర్ బిగినింగ్ లో కింగ్ నాగార్జున తో తెరకెక్కించిన నిన్నేపెళ్లాడుతా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సంచలన విజయం అందుకుంది .ఇక ఈ సినిమా హిట్ అయింది కాబట్టి మల్లి ఇదే జానర్ లో సినిమా లు చేయమని కొంత మంది నిర్మాతలు అడగ్గా ? తీసిన జానర్ నే మల్లి రిపీట్ చేయడం ఎందుకు ఆ సినిమా అయిపోయింది అని నిర్మాతలకు సమాధానం ఇచ్చారు.

Telugu Anil Ravipudi, Geners, Directors, Gangster, Heroes, Koratala Siva, Pawan

సినిమాలు ఎన్ని జానర్స్ ఉన్న ఒక్క జానర్ మాత్రం ఎప్పటికి క్రేజ్ ఉంటుంది , ఆ జానర్ ఏమిటి అంటే ? అదే గ్యాంగ్‌స్టర్‌ జానర్ ,గ్యాంగ్‌స్టర్‌ డ్రామాస్ , ఈ జానర్ లో సినిమాలు తెరకెక్కించడం లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు .సత్య సినిమా చూసినట్లు అయితే ముంబయ్ లో జరిగిన గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇక అసలు విషయానికి వస్తే .గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలకు ప్రేక్షకుల్లోనూ ,సినిమా పరిశ్రమ లోను ఎప్పుడు క్రేజ్‌ ఉంటుంది.కధలో దమ్ము , కధలో కొత్త ధనం ,స్క్రీన్ ప్లే , భారి యాక్షన్ సీన్స్ , హీరోయిజమ్ ఎలివేషన్ షాట్స్ , స్టోరీ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , ఇంట్రస్టింగ్ పాయింట్స్ ,కధలో ట్విస్ట్స్ మీద ట్విస్ట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వర్క్ అవుట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది .ప్రస్తుతం ఈ తరహా స్టోరీస్ మీదనే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ అండ్ సీనియర్ హీరోస్ .మరి వారెవరు? వారి చిత్ర విశేషాలేంటి?

Telugu Anil Ravipudi, Geners, Directors, Gangster, Heroes, Koratala Siva, Pawan

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక్క జానర్ లో వచ్చిన సినిమా పెద్ద హిట్ అయితే మల్లి అదే జానర్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు ,డైరెక్టర్స్ హీరోస్ .ఒక్కోసారి యాక్సిడెంటల్ గా కావొచ్చు.ట్రెండ్ ని ఫాలో అవచ్చు .మరి కొన్నిసార్లు స్టార్ హీరోస్ ఒకే రకమైన కథలు , ఒకే తరహా క్యారెక్టర్స్ లో కనిపిస్తుంటారు .ఇప్పుడు ఆ సినిమాలే ప్రేక్షకులు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు .గ్యాంగ్‌స్టర్‌ జానర్ లో వచ్చిన ,వస్తున్న సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది .ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ను ఓ గ్యాంగ్‌స్టర్‌ లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు యంగ్ డైరెక్టర్ సుజీత్‌. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే .ఇక ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే జపాన్‌ నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమా మోషన్ పోస్టర్ లోనే చిన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజీత్.

Telugu Anil Ravipudi, Geners, Directors, Gangster, Heroes, Koratala Siva, Pawan

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ సినిమా కేజీఎఫ్‌’ రెండు పార్ట్శ్ ప్రేక్షకులను బాగా అలరించాయి .ప్రస్తతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ‘సలార్‌’ సినిమా కూడా గ్యాంగ్‌స్టర్‌ జానర్ కావడం మరో విశేషం .ఈ సినిమాలో ప్రభాస్‌ గ్యాంగ్‌స్టర్‌గా లుక్ చాలా వైవిధ్యంగా ఉంటుంది అని తెలుస్తుంది .‘ఖైదీ’, ‘విక్రమ్‌’ వంటి గ్యాంగ్‌స్టర్‌ డ్రామా సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర పెద్ద విజయం అందుకున్నాయి .విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ జానర్ కూడా గ్యాంగ్‌స్టర్‌ జానర్ అవ్వడం మరో విశేషం .ఇక ఫైనల్ గా ఈ గ్యాంగ్‌స్టర్‌ సినిమాలకు బలే గిరాకీ ఉంది .సో ఎప్పుడో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరిచయము చేసిన ఈ గ్యాంగ్‌స్టర్‌ జానర్ తో ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ కూడా అదే జానర్ లో సినిమా చేసి సక్సెస్ అవుతున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube