కేంద్ర బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకూ న్యాయం చేశామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్ సభలో ఆమె కేంద్ర బడ్జెట్ వివరణ ఇచ్చారు.
వార్షిక బడ్జెట్ లో ఈసారి రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రూ.1.3 లక్షల కోట్లు కేటాయించామని ఆమె స్పష్టం చేశారు.కాగా 2023-24 సంవత్సరానికి గానూ రూ.45.03 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.గత బడ్జెట్ లో వేసిన పునాదులపై సాగుతూ వందేళ్ల భారత్ బ్లూప్రింట్ లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఉపయోగపడేలా బడ్జెన్ ను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.







