మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
మావెరిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ తో చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుపు కుంటుంది.ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా రామ్ చరణ్ తాజాగా తెలంగాణ ఐటీ శాఖా మంత్రి అయినటువంటి కేటీఆర్ ను, అలాగే భారత్ దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రాలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఈ పిక్స్ లో చరణ్ కొత్త లుక్ లో కనిపించారు.ఈ మీట్ గురించి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

మీట్ అద్భుతంగా జరిగింది అని.నా ఫ్రెండ్ రామ్ చరణ్ అందుకున్న గోల్డెన్ గ్లోబ్స్ ఇంకా అకాడమీ అవార్డు కి ఎంపిక కావడం ఆనందంగా ఉంది అని చరణ్ కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు.ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా పిక్స్ కూడా మెగా ఫ్యాన్స్ లో తెగ షేర్ అవుతున్నాయి.







