మహా నటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్.మహా నటి సినిమా తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.
ఆ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఈమె చేసింది.మహా నటి తర్వాత ఈమె రెమ్యూనరేషన్ ఏకంగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలకు పెరిగింది.
ఈమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి.కొన్ని విడుదలకు కూడా కష్టాలను ఎదుర్కొన్నాయి.
దాంతో ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ కేవలం కోటి రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది.

నాని హీరో గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందుతున్న దసరా సినిమా కు గాను ఈమె డి గ్లామర్ రోల్ లో కనిపించబోతుంది.అందుకు గాను ఈ సినిమాకు కీర్తి సురేష్ కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందట.అంతే కాకుండా ముందు ముందు తాను నటించబోతున్న సినిమాలకు కూడా కోటి నుండి కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వరుసగా రెండు మూడు సక్సెస్ దక్కించుకుంటే అప్పుడు మళ్ళీ ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి.కీర్తి సురేష్ దసరా సినిమా పై చాలా ఆశలు పెట్టుకొని ఉంది.అలాగే చిరంజీవి నటిస్తున్న ఒక సినిమా లో కూడా కీలక పాత్ర లో కీర్తి సురేష్ నటిస్తోంది.తమిళం లో మరియు హిందీ లో కూడా ఈమె సినిమాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
ముఖ్యంగా ఈమె తెలుగు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తో తెలుగు లో మరిన్ని సినిమాల్లో నటించేలా చేసింది అనడంలో సందేహం లేదు.







