నందమూరి కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.ఈయన ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ ఈయనకు సరైన హిట్ లేక టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగలేక పోయారు.
ఈయన కెరీర్ మొత్తం చూసుకుంటే రెండు మూడు సినిమాలు మినహా పెద్దగా సినిమాలు ఏవీ లేవు.
అయితే గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో మాత్రం కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ తన లైనప్ ను భారీగా సెట్ చేసుకుంటున్నాడు.మరి ఈయన లైనప్ లో ముందు వరుసలో ఉన్న సినిమా ‘అమిగోస్’.
ఈ సినిమాపై బింబిసార ఎఫెక్ట్ తో బాగానే అంచనాలు పెరిగాయి.
మరి అమిగోస్ సినిమా ముందు నుండి ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ నుండి పోస్టర్స్, పాటలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు అయితే పెరిగాయి.
డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇదిలా ఉండగా మరి కొద్దీ గంటల్లోనే ఈ సినిమా ఎలాంటి హిట్ కాబోతుందో తేలిపోనుంది.ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు రోల్స్ లో నటించారు.దీంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.ఇక ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ కూడా లాక్ అయ్యినట్టు సమాచారం.ఈ సినిమా హక్కులను దిగ్గజ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు టాక్.
రిలీజ్ తర్వాత కొన్ని వారల అనంతరం ఈ సినిమా ఓటిటిలో సందడి చేయనుంది.