తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు రంగారెడ్డి – మహబూబ్ నగర్ – హైదరాబాద్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.మార్చి 13న పోలింగ్ జరగనుండగా… 16వ తేదీన కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
అయితే, ఎమ్మెల్సీ కే.జనార్థన్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 29తో ముగియనుంది.







