దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా తాజాగా మరొకరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో భాగంగా రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్లను రాజేశ్, లుపిన్ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా దినేశ్ అరోరాకు రాజేశ్ జోషి నగదు అందజేశారని ఈడీ చెబుతోంది.
నిన్న ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేయగా… కొన్ని గంటల్లోనే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.