నేషనల్ క్రష్ రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తన నోటి దూల కారణంగా కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాలలో చిక్కుకొని నేటిజన్ల ట్రోలింగ్ కి గురైన రష్మిక పలుమార్లు తనపై వస్తున్నటువంటి నెగెటివిటీ గురించి స్పందించారు.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రష్మిక ట్విట్టర్ వేదికగా నెగిటివిటీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రష్మిక నెగిటివిటీ గురించి స్పందిస్తూ… ఎప్పుడు సంతోషంగా ఉండండి జీవితం పట్ల ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండండి మీ జీవితంలో శ్రేయస్సు ఆనందం అనేవి అన్నిటికన్నా ఎంతో ప్రాధాన్యత కలిగినవి.జీవితం చాలా చిన్నది దాంట్లో నెగెటివిటీ కి తావులేదు అంటూ ఈ సందర్భంగా రష్మిక ఒక ట్వీట్ చేశారు.
ఇలా నెగెటివిటీ గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమ గురించి రష్మిక చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.అలాగే హిందీలో ఈమె నటించిన మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి చాలా చులకనగా మాట్లాడారు.దీంతో ఈమె పెద్ద ఎత్తున నెగిటివిటీ ఎదుర్కొంది.
ఈ క్రమంలోనే రష్మిక ఎప్పటికప్పుడు నెగిటివిటీ గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో రష్మిక బిజీగా ఉన్నారు.







