చాలా మందికి అకస్మాత్తుగా పక్కటెముకలు పట్టేస్తూ ఉంటాయి.దీని కారణంగా చాలామంది కింద కూర్చోలేరు.అలాగే వెంటనే లేవలేరు.అయితే పక్కటెముకలు గుండెకు అలాగే ఊపిరితిత్తుల తో సహా ఛాతి లోపల శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి.అయితే ఛాతికి ప్రతి వైపున 12 పక్కటేముకలు ఉంటాయి.అవి వెన్నుముక నుండి వెనుక వైపుకు స్టెర్నం లేదా రొమ్ము ఎముక వరకు ముందు భాగంలో ఉంటాయి.
మృదులాస్తి ద్వారా రొమ్ము ఎముకకు అనుసంధానించబడి ఉంటాయి.శ్వాస తీసుకునే సమయంలో పక్కటెముకలు విస్తరిస్తాయి.
ఇంటర్ కోస్టల్ కండరాలు అని పిలవబడే కండరాలు కూడా పక్కటెముకలు మధ్యగా వెళుతూ ఛాతి గోడను కదిలిస్తాయి.ఇక అతి ముఖ్యంగా శ్వాస సమయంలో పక్కటెముకలు నొప్పి ఏ భాగంలో నుండి అయిన ఎదురవుతుంది.
అలాగే వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా ఆటలు ఆడుకుంటున్నప్పుడు కింద కూర్చొని లేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పక్కటెముకలు పట్టేస్తుంటాయి.అయితే ఆ సమయంలో నొప్పి చాలా తీవ్రంగా అనిపిస్తుంది.ఇలా జరగడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ హఠాత్తుగా నొప్పితో చాలా మంది భయాందోళన చెందుతారు.
అంతేకాకుండా ఈ వ్యాయామం వల్ల అలాగే ఆటల వల్ల ఈ నొప్పి వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు.అలాగే ఎక్కువగా దగ్గడం వల్ల కూడా పక్కటెముకలు పట్టేసి నొప్పి కలుగుతుంది.ఎందుకంటే దగ్గడం వల్ల పదేపదే కదలికతో ప్రత్యేకించి కండరాలు లాగి నొప్పి లేదా పక్కటెముకల నొప్పి కలిగిస్తుంది.
ఇలాంటి పక్కటెముకల నొప్పి కలగటానికి డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించడం కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే రక్త సరఫరా ఎక్కువ కావడం వలన దీనికి ప్రధాన కారణం అని భావిస్తున్నారు.అలాగే లోపలి అవయవాలు కూడా కిందికి లాగడం ఒక కారణం అని చెప్పవచ్చు.ఆహారం తీసుకున్న వెంటనే శారీరక శ్రమ చేయకూడదు.
అలాంటి సమయంలో తిన్న ఆహారం జీర్ణం కాకుండా జీర్ణాశయానికి రక్తసరఫరాను ఎక్కువ చేస్తుంది.దీంతో డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గుతుంది.
అలాగే రక్తంలో క్యాల్షియం, పొటాషియం సోడియం వంటి మోతాదులు తక్కువ అయ్యి ఈ సమస్యకు దారితీస్తుంది.