బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలాఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారి సినీ వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రెండవ సీజన్ చివరి ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు.
ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రసారం కాగా ఈ ఎపిసోడ్ కి అద్భుతమైన ఆదరణ లభించింది.

ఈ క్రమంలోనే త్వరలోనే రెండవ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా పవన్ ను బాలయ్య ఎన్నో ప్రశ్నలు వేశారు.
ముఖ్యంగా రాజకీయాల గురించి కూడా ఈయనని ప్రశ్నించారు.సినిమాల పరంగా నీకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు అయితే ఆ అభిమానం ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కాలేదు అంటూ ప్రశ్నించారు.
అదేవిధంగా సినిమాలు వదిలేసి ప్రజాసేవకే అంకితం కానున్నారా అంటూ బాలయ్య ప్రశ్నించారు.

ఇలా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఇలా ప్రశ్నించడంతో అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.మరి బాలకృష్ణ అడిగినటువంటి ఈ ప్రశ్నకు పవన్ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు అనేది ఆసక్తికరంగా మారింది.మరి ఈ ప్రశ్నకు పవన్ సమాధానం ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.







