తెలుగు చిత్ర పరిశ్రమలో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది.లెజెండ్స్ గా, సీనియర్ నటులుగా ఉన్న అనేకమంది సెలబ్రిటీలు ఒకటి తర్వాత ఒకరు ఈ లోక నుంచి శాశ్వత విరామం తీసుకుంటున్నారు.
గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో మొదలైన ఈ మృతుకేళి ఇంకా కొనసాగుతూనే ఉంది.సెప్టెంబర్ లో కృష్ణంరాజు దీర్ఘకాలిక సమస్యలతో పోరాడుతూ కన్నుమూశారు.
ఆయన మరణంతో తీవ్ర ఉత్కంఠకర పరిస్థితులు మొదలయ్యాయి.అప్పట్నుంచి నేటి వరకు ఎవరు ఎలా కన్నుమూస్తారో తెలియక అందరూ ఊపిరి బిగబట్టి ఉన్నారు.
ఎలాంటి సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చాలామంది భయపడుతూనే ఉన్నారు అనుకున్నట్టుగానే రోజుల వ్యవధిలో వారాల వ్యవధిలో చాలామంది లెజెండ్స్ కన్నుమూస్తున్నారు.

సెప్టెంబర్ 2021 లో కృష్ణంరాజు కన్నుమూశారు.ఆ తర్వాత కొన్ని రోజులు గడవక ముందే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశాడు.అనారోగ్య కారణాలతోనే రమేష్ బాబు మృతి చెందడంతో ఆయన మృతి వార్త తట్టుకోలేని మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మంచానికి పరిమితమయ్యారు.
మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూసిన కేవలం నెల రోజుల కాలంలోనే అదే దుఃఖంతో కృష్ణ కూడా మంచాన పడ్డారు.కొడుకును ఇటు భార్యను కోల్పోయిన దుఃఖం ఆయనను కోలుకొని ఇవ్వలేదు.
అలా సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.మహేష్ బాబు ఒకే ఏడాదిలో ఇంట్లోని ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అటు ఆయన కుటుంబ సభ్యులను, సూపర్ స్టార్ అభిమానులు సైతం కలవడానికి గురిచేసింది.

ఇక వెండితెర యముడు అయినా కైకాల సత్యనారాయణ సైతం గత కొన్ని నెలలుగా చావుతో పోరాడుతూ కన్నుమూయడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన చనిపోయిన వెంటనే కొంతకాలానికే నటుడు చలపతిరావు సైతం అనారోగ్యంతో కన్నుమూశారు.ఆ తర్వాత వెండితెర సత్యభామ జమున కూడా అనారోగ్య కారణాలతోనే కన్ను మూసింది.నిన్నటికి నిన్న కళాతపస్వి కే విశ్వనాథ్ గారిని సైతం తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది.
వీరే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కలవడానికి గురిచేసింది ఇక మరి కొంతమంది ఇదేదో కన్నుమూశారు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఈ ఏడాది వరుసగా కన్నుమూయడంతో అసలు ఏం జరుగుతుందో చాలామందికి అర్థం కావడం లేదు.







