తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.ఈయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం తనకి నచ్చిన వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఖుషి చేస్తూ వుంటారు.
అతను చేసిన పోస్ట్ లో ఓ బేబీ ప్రయాణిస్తున్న సమయంలో పడుకొని కిటికీలో నుంచి చూస్తున్నట్లుగా ఓ ఫొటో ఉంది.ఈ ఫొటోను షేర్ చేసిన మంత్రి నెటిజన్లకు ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారు.
అదేమంటే ఈ ఫొటోలో ఉన్న బేబీ రైల్‌లో ఉన్నారా? విమానాలో ఉన్నారా? చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.

దాంతో ఈ పోస్ట్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.దానికి నెటిజన్లు స్పందిస్తూ… “ఆ ఫొటో ప్రకారం చూస్తే.బేబీ రైలులో ప్రయాణిస్తూ, విశాలమైన మెత్తటి సీటుపై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు కనబడుతోంది!” అంటూ సమాధానం ఇస్తున్నారు.
కాగా సదరు ఫోటో. రైల్వే కోచ్ లోపలి భాగాన్ని చూపుతుంది.
ప్రయాణీకులకు, ప్రత్యేకించి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అదనపు సౌకర్యాన్ని అందించడానికి భారతీయ రైల్వే అమలు చేస్తున్న సౌకర్యాలను చెబుతూ రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇలా పేర్కొన్నారు.

కాగా ఈ ఫొటో నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.ఈ ఫొటోను షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 53వేల కంటే ఎక్కువ లైక్‌లు పొంది రికార్డ్ సృష్టించింది.అంతేకాకుండా మిలియన్ కంటే ఎక్కువ మంది దానిని చూడడం జరిగింది.
మంత్రి అశ్విని వైష్ణవ్.దేశంలో రైల్వే పురోభివృద్ధిని తెలియజేస్తూ, అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత దృశ్యాలను షేర్ చేస్తూ… ప్రయాణీకులకోసం రైల్వేశాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో గత సంవత్సరం శ్రీనగర్ రైల్వే స్టేషన్ వద్ద మంచుతో కప్పబడిఉన్న అనేక అద్భుతమైన ఫొటోను కేంద్ర మంత్రి ట్వీట్ చేయగా సదరు ఫొటోను కూడా నెటిజన్లు బాగా ఇష్టపడ్డారు.







