నందమూరి కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.ఈయన ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ ఈయనకు సరైన హిట్ లేక టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగలేక పోయారు.
ఒకవైపు తమ్ముడు ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.కానీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ నాలుగు సినిమాలు కూడా లేవు.
ఈయన కెరీర్ మొత్తం చూసుకుంటే రెండు మూడు సినిమాలు మినహా పెద్దగా సినిమాలు ఏవీ లేవు.అయితే గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో మాత్రం కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ తన లైనప్ ను భారీగా సెట్ చేసుకుంటున్నాడు.మరి ఈయన లైనప్ లో ముందు వరుసలో ఉన్న సినిమా ‘అమిగోస్’.
ఈ సినిమాపై బింబిసార ఎఫెక్ట్ తో బాగానే అంచనాలు పెరిగాయి.మరి అమిగోస్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండడంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.ఇటీవలే వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు అయితే పెరిగాయి.డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా మేకర్స్ మరొక సాలిడ్ అనౌన్స్ మెంట్ చేసారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన అప్డేట్ ఇచ్చారు.గ్రాండ్ గా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్టుగా హాజరు అవుతున్నట్టు ప్రకటించారు.ఫిబ్రవరి 5 ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ జరగనుంది.కళ్యాణ్ రామ్ గత సినిమా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ హాజరయ్యాడు.
ఇది బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇక ఇప్పుడు తారక్ మరోసారి అన్న కోసం రావడంతో సెంటిమెంట్ పక్కాగా రిపీట్ అవుతుంది అని తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు.