తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ రమాప్రభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు రమాప్రభ గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులు ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఎన్నో సినిమాలలో కమెడియన్గా చేసి లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అంతేకాకుండా తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వచ్చింది.
కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి అలరించారు.తెలుగులో దాదాపుగా 1400 పైగా సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది రమాప్రభ.
70-80 కాలంలో అయితే వరుసగా సినిమాలలో నటించడంతో పాటుగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.రమాప్రభ నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్న విషయం తెలిసిదే.
కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.వారి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు.
అదే సమయంలో సినిమాల ద్వారా సంపాదించిన రమాప్రభ కోట్ల ఆస్తులన్నీ కరిగిపోయాయి.కాగా ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు రమాప్రభ.
వయోభారంతో అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది.కాగా గతేడాది కీర్తి సురేశ్ నటించిన గుడ్ లక్ సఖి సినిమాలో చివరిసారిగా కనిపించారు రమా ప్రభ.
అంతకుముందు పూరిజగన్నాథ్ రొమాంటిక్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రమాప్రభ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే
ఆమె ఆర్థిక పరిస్థితి దిగదారిపోయిందని ప్రస్తుతం ఆమె బిక్షం ఎత్తుకుంటోందంటూ ఎన్నో రకాల కథనాలు వినిపించాయి.తాజాగా ఈ వార్తలపై స్పందించిన రమాప్రభ ఎమోషనల్ అవుతూ అటువంటి అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి అని ఆమె తెలిపింది.ఈ సందర్భంగా ఆమె వార్తలపై స్పందిస్తూ.
నేను అడుక్కు తింటున్నానంటూ కొందరు యూట్యూబ్ లో తెగ కథనాలు రాస్తున్నారు.నా సొంత యూట్యూబ్ ఛానల్ అయిన రమాప్రభ ప్రయాణంలో నా ఇంటిని స్వయంగా దగ్గరుండి చూపించాను.
నిజంగా నేను భిక్షమెత్తుకునే దీన పరిస్థితిలో ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నా యూట్యూబ్ వీడియోల కోసం నేను తలమునకలై ఉన్నాను.
అలాంటిది ఏ గ్యాప్ లో నేను అడుక్కుంటాను? పూరీ, నాగార్జున, మరికొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు.వారికి తోచిన సహాయం చేస్తున్నారు.వారు నన్ను తమ ఇంటి మనిషిగా వాళ్లు ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకువుతుంది? వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు ప్రేమతో ఇస్తున్నారు.ఇంకా చెప్పాలంటే అందరి కంటే నేను చాలా ధనవంతురాలిగా ఉన్నాను అని రమాప్రభ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.అయితే ఇంటర్వ్యూలో భాగంగా రమాప్రభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సూచన మీడియాలో వైరల్ అవుతున్నాయి.