నాగ చైతన్య ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు ‘ధూత’ అనే వెబ్ సిరీస్ ను చేసిన విషయం తెల్సిందే.విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఆ వెబ్ సిరీస్ రూపొందింది.
ఆ వెబ్ సిరీస్ కి ముందు ఇద్దరి కాంబోలో థాంక్యూ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా ను దిల్ రాజు నిర్మించాడు.
కమర్షియల్ గా ఆ సినిమా నిరాశ పర్చింది.దాంతో విక్రమ్ కే కుమార్ మరియు నాగ చైతన్య కాంబో పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది.
అందుకే వీరిద్దరి కాంబోలో రూపొందిన ధూత వెబ్ సిరీస్ కనిపించకుండా పోయింది.
షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ వారు అధికారికంగా ప్రకటించారు.నాగ చైతన్య ను చాలా కొత్తగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.అక్కినేని అభిమానులతో పాటు థ్రిల్లర్ సినిమా లు ఇష్టపడే వారు మరియు వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారు చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూశారు.
సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు అందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు.
దాంతో చేసేది లేక అక్కినేని అభిమానులు ఆ వెబ్ సిరీస్ పై ఆశలు వదిలేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.మరో వైపు అక్కినేని అభిమానులు అప్పుడప్పుడు అమెజాన్ ప్రైమ్ ను ట్యాగ్ చేసి ఎప్పుడు ధూత వస్తుంది అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు.వారు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.
ముందు ముందు అయినా ధూత వెబ్ సిరీస్ వస్తుందా లేదంటే పూర్తిగా ఆ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులు మర్చిపోవాల్సిందేనా అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.మరో వైపు నాగ చైతన్య హీరోగా కస్టడీ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.