నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న దసరా సినిమా మార్చి నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఇటీవలే టీజర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.
అయితే సినిమా లోని నాని లుక్ ను కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.సాఫ్ట్ గా నానిని చాలా మంది ఇష్టపడుతారు.
కానీ ఇలా ఎవరు ఇష్టపడుతారు అంటూ విమర్శలు చేస్తున్నారు.చాలా మంది ప్రస్తుతం దసరా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ మరో వైపు నాని దసరా సినిమా లోని లుక్ ను చూసి మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆ మధ్య రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లు మాస్ లుక్ లో కనిపించినప్పుడు ఇలాంటి అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఆ సమయంలో ఏం జరిగిందో మనం చూశాం.తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా దసరా సినిమా ఉంటుందని.
మరీ నాటుగా ఉన్నా కూడా మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులు నాని కోసం వస్తారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నాని తో పాటు కీర్తి సురేష్ కూడా అదే మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తెలుగు ప్రేక్షకులు చాలా అందంగానే చూశారు.మొదటి సారి ఆమె డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతుంది.
రష్మిక మందన్నా ను ఎలా అయితే రిసీవ్ చేసుకున్నారో అలాగే కీర్తి సురేష్ ను కూడా తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.గతంలోనే కీర్తి సురేష్ ఒక తమిళ సినిమా కోసం డీ గ్లామర్ మాస్ రోల్ లో కనిపించి మెప్పించింది.

కనుక ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టడం ఖాయం.మల్టీ ప్లెక్స్ ప్రేక్షకుల విషయంలో ఎలాంటి అనుమానం లేదు అనేది చాలా మంది అభిప్రాయం.సోషల్ మీడియాలో నాని దసరా సినిమా గురించి జరుగుతున్న ప్రచారంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







