అవిసె గింజలతో ఇలా చేస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా 2 నెలల్లో ఒత్తుగా మారుతుంది!

చాలా మంది తమ జుట్టు పల్చగా ఉందని తీవ్రంగా మదన పడుతుంటారు.పల్చటి జుట్టుతో ఎటువంటి హెయిర్ స్టైల్స్ ను వేసుకోలేరు.

 Doing This With Flax Seeds Will Make Thin Hair Thicker, Thin Hair, Thick Hair, F-TeluguStop.com

అలాగే జుట్టు పల్చగా ఉండటం వల్ల అందం కూడా తగ్గుతుందని అధిక శాతం మంది భావిస్తుంటారు.ఈ క్రమంలోనే పల్చగా ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు వర్రీ వద్దు.ఎందుకంటే అవిసె గింజలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే రెండు నెలల్లోనే ఒత్తుగా మారుతుంది.

అవిసె గింజల్లో హెయిర్ గ్రోత్ ను డబుల్ చేసే పోషకాలు మెండుగా ఉంటాయి.

మరి ఇంతకీ అవిసె గింజలు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Flax Seeds, Flaxseeds, Care, Care Tips, Fall, Latest, Thick, Thin-Telugu

ఆ తర్వాత గుప్పెడు ఎండిన మందార పువ్వు రేకులు వేసి పది నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే అర‌ కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.

Telugu Flax Seeds, Flaxseeds, Care, Care Tips, Fall, Latest, Thick, Thin-Telugu

వారానికి ఒకసారి అవిసె గింజలతో ఈ రెమెడీని కనుక పాటిస్తే పలుచగా ఉన్న జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు సిల్కీగా, షైనీ గా తయారవుతుంది.జుట్టు రాలడం సైతం తగ్గు ముఖం పడుతుంది.కాబట్టి పల్చటి జుట్టు తో బాధపడుతున్న వారు తప్పకుండా అవిసె గింజలతో పైన చెప్పిన రెమెడీని పాటించండి.కురుల‌ను ఒత్తుగా మార్చుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube