నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం దసరా.ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కింది.ఇందులో నాని పూర్తిగా డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాలో నాని లుక్ కి సంబంధించిన పోస్టర్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో మరోసారి నాని కీర్తి సురేష్ జతకట్టబోతున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.1: 15 సెకండ్లు నిడివి కలిగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ టీజర్ పై ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి స్పందించారు.ఈ సందర్భంగా ఈయన ఈ సినిమా టీజర్ పై స్పందిస్తూ.దసరా టీజర్ విజువల్స్ బాగా నచ్చాయి.
నాని భారీ మేక్ఓవర్ ఆకట్టుకుంటుంది.ఒక కొత్త దర్శకుడు అలాంటి ప్రభావాన్ని సృష్టించడం చాలా బాగుంది చివరి షార్ట్ అద్భుతం అంతా మంచే జరగాలి అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా ఈ సినిమా టీజర్ పై స్పందించారు.

ఇలా ప్రపంచ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దసరా టీజర్ గురించి స్పందించి ప్రశంసల కురిపించడంతో ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాజమౌళి ట్వీట్ కి స్పందించి రిప్లై ఇచ్చారు.సార్ మీ ట్వీట్ కి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది.మీకు ఇంగ్లీషులోనే రిప్లై ఇద్దామని అనుకున్నాను కానీ తెలుగులోనే మాటలు వస్తలేవు సార్.కోతి లెక్క గెంతుతున్నా ధన్యవాదాలు సార్ అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాజమౌళి ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







