టీమిండియా క్రికెట్ అభిమానులు ఓ చేదు వార్త.టీమిండియా సీనియర్ బ్యాటర్ అయినటువంటి మురళీ విజయ్ ఇకనుండి క్రికెట్ మర్చిపోనున్నాడు.
అదేనండి, తాజాగా అతగాడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి షాకిచ్చాడు.ఈ మేరకు తన రిటైర్ మెంట్ లేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసాడు.
2008లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన మురళీ విజయ్ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.ఈ మధ్యకాలంలో అతగాడు టెస్టుల్లో కీలక ప్లేయర్ గా అవతరించాడు.ఓపెనర్ గా ఆడిన విజయ్ టెస్టుల్లో దాదాపు 4వేల పరుగులు చేయడం విశేషం.38 ఏళ్ల విజయ్ రిటైర్ మెంట్ తర్వాత ప్రపంచ క్రికెట్ పై దృష్టిపెట్టనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపాడు.మురళీ విజయ్ భారత్ తరఫున మొత్తం 61 టెస్టులు, 17 వన్డే మ్యాచులు అడగా టెస్టుల్లో 3982 పరుగులు, వన్డేల్లో 339 పరుగులు సాధించాడు.
ఓవర్సీస్ లో భారత్ కు మురళీ విజయ్ ఉత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు.
విదేశాల్లో అయితే మురళీకి మంచి రికార్డులు వున్నాయి.ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ వేదికగా చేసిన 144 పరుగులు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేరు.అంతేకాకుండా ఇంగ్లండ్ పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా చేసిన 145 పరుగులు కూడా విజయ్ టెస్ట్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచాయి.
ఇకపోతే రోహిత్ శర్మ, KL రాహుల్, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్లు ఓపెనర్లుగా బాగా రాణించడంతో BCCI 2018 నుంచి మురళీ విజయ్ ను జట్టులోకి తీసుకోవడం మానేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా BCCI 40 ఏళ్లు వచ్చినవారిని వృద్ధులుగా చూస్తోందంటూ మురళీ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.