కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.

 Inquiry On Kamareddy Master Plan In High Court-TeluguStop.com

ఈ క్రమంలో వ్యక్తిగతంగా హాజరైన కేఏ పాల్ వాదనలు వినిపించారు.

రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రూపొందించిందని ఆయన మండిపడ్డారు.

అయితే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినట్లు కౌన్సిల్ ప్రకటించిందన్నారు.ఈ నేపథ్యంలో కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని తెలిపారు.

మాస్టర్ ప్లాన్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.కేఏ పాల్ వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 13లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube