భారత సంతతి రాజా చారికి అమెరికా ఎయిర్ ఫోర్సులో కీలక పదవి..

ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.అలా వెళ్లిన కొన్ని కుటుంబాల వారు ఆదేశాలలో చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ ఉంటారు.

 Indian-american Astronaut Raja Chari Has A Key Position In The Us Air Force, Ind-TeluguStop.com

అలా జీవించిన కొన్ని కుటుంబాలు ఆ దేశంలోనే స్థిరపడి పోతూ ఉంటారు.అలా కొన్ని దేశాలలో స్థిరపడిపోయిన భారత సంతతి కుటుంబాల ప్రజలు ఆ దేశాలలో అత్యున్నత పదవులలో కొనసాగుతున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారి అరుదైన ఘనతను సాధించనున్నారు.అధ్యక్షుడు జో బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ చేశారు.

Telugu Aeronautics, Airforce, America, Astronautics, India, Indian American, Int

సెనేట్ దీన్ని ఆమోదిస్తే అగ్రరాజ్యం అమెరికా వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు అందుకున్న భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.అమెరికా వైమానికా దళంలో సైన్యం లాగే బ్రిగేడియర్‌లను వన్ స్టార్ జనరల్ గా పరిగణిస్తారు.అంతే కాకుండా అమెరికా ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కొన్ని ర్యాంకులు కూడా ఉంటాయి.

Telugu Aeronautics, Airforce, America, Astronautics, India, Indian American, Int

అంతే కాకుండా చంద్రుని పైకి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న అమెరికా మిషన్ బృందంలో చారి సభ్యుడు.ఈయన సారథ్యంలోనే 2021లో నాసా సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది.అక్కడ 107 రోజులు ఉన్న రాజా చారి స్పేస్ వాక్ కూడా నిర్వహించడం విశేషం.

అంతేకాకుండా రాజా చారి నాసాలో చేరక ముందు అమెరికా ఎయిర్ ఫోర్సులో టెస్ట్ పైలెట్ గా కూడా పనిచేశారు.మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌ లో మాస్టర్స్ డిగ్రీ రాజా చారి పూర్తి చేశారు.

ఇలాగా మన దేశ ప్రజలు ఎక్కడ ఉన్నా అత్యున్నత పదవులలో కొనసాగాలని మనం కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube