ప్రశ్నిండానికంటూ జనసేన పార్టీ పుట్టుకు వచ్చిన దగ్గరి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత పొలిటికల్ గా యాక్టివ్ అయింది.మాంచి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో.
యువత మొత్తం ఆ పార్టీ వైపు మొగ్గింది.అంతకు ముందు సేవే లక్ష్యం ప్రేమే మార్గం అంట పవన్ అన్న కొణిదెల చిరంజీవి.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అట్టర్ ఫ్లాప్ అయ్యారు.ప్రజారాజ్యం పార్టీలో మెగా హీరోలు అంతా.
ఒక్కతాటిపై ప్రచారం చేశారు.పవన్ కళ్యాణ్ సైతం సొంత ఇమేజ్ తో యాత్రలు పూర్తి చేశారు.
అప్పుడప్పుడే స్టార్డమ్ తెచ్చుకుంటున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ప్రచారం చేశారు.
జనసేన పార్టీ పెట్టిన దగ్గరి నుంచి వచ్చిన రెండు ఎన్నికల్లో.
పెద్దగా ప్రబావం చూపలేక పోయింది.అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం కొద్దిమేర పుంజుకుంది.
దాంతో కుల సమీకరణలతో పాటు.మరోవైపు యువతను, ఫ్యాన్స్ ను ఓటర్లుగా మార్చుకునేందకు ప్రయత్నాలు మొదలు అయ్యాయి.
ఈ సారి యువతను అట్రాక్ట్ చేసేందకు ఏకంగా రామ్ చరణ్ ను రంగంలోకి దించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.రామ్ చరణ్ ను ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సైతం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

నిజానికి మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి తీసుకోవాల్సి ఉంది.అయితే ఆయన పార్టీలోకి చేరితే.అది జనసేనకు చెడ్డ పేరు తీసుకు వస్తుందని.జనసేన నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయనకు బదులు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలని పవన్ భావిస్తున్నారు.మెగా బ్రదర్ నాగబాబు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయనుండటంతో.
రాష్ట్రంలో పవన్ వెంట తిరిగేందకు చరణ్ ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఎన్నికల కంటే కనీసం ఆరు నెలల ముందు రామ్ చరణ్ కు జనసేన కండువా కప్పాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని టాక్.ఒక వేళ అదే నిజం అయితే రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ.బాబాయ్ పార్టీతో మొదలు కానుంది.
మరి రామ్ చరణ్ పొలిటికల్ గా నిజంగా రాణిస్తారా.? లేక తండ్రిలా చతికిలా పడతారా అనేది చూడాలి.