తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహాణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ నేపథ్యంలో వేడుకలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని ఆదేశించింది.
కోవిడ్ ను సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదని హైకోర్టు తెలిపింది.కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని పేర్కొంది.
అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం లేదంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.







