ఆస్కార్‌ నామినేషన్స్ లో రాజమౌళికి చోటు దక్కక పోవడంకు కారణం ఇదే!

ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాట కు చోటు దక్కిన విషయం తెలిసిందే.ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో మన నాటు నాటు పాట నిలవడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే విషయం.

 Rrr Movie Director Rajamouli Not In Oscar Race , Rrr Movie , Rajamouli , Ntr-TeluguStop.com

ఈ సమయం లోనే ఉత్తమ దర్శకుడి కేటగిరీ లో రాజమౌళి పేరు లేకపోవడం ఆవేదన కలిగించింది.రాజమౌళి అభిమానులతో పాటు యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నామినేషన్ లో ఉత్తమ దర్శకుడి జాబితా లో రాజమౌళి పేరు లేక పోవడం తో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Telugu Natu Natu, Oscar Awards, Oscar, Rajamouli, Ram Charan, Tollywood-Movie

ఉత్తమ నటుడు మరియు ఉత్తమ చిత్రం కేటగిరీ లో కూడా ఆస్కార్ నామినేషన్ ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది భావించారు.కానీ ఆస్కార్ యొక్క పోటీ లో రాజమౌళి వెనుక పడ్డాడు.రాజమౌళి చోటు దక్కించుకోలేక పోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.అందులో ముఖ్యంగా ఒక ఇండియన్ దర్శకుడు అవడం అది మన ఆర్‌ఆర్ఆర్‌ ఒక ప్రాంతీయ భాషా చిత్ర దర్శకుడు అవడం వల్లే జక్కన్న కు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కలేదు అనేది చాలా మంది అభిప్రాయం.

Telugu Natu Natu, Oscar Awards, Oscar, Rajamouli, Ram Charan, Tollywood-Movie

దాంతో పాటు హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల దర్శకులు చాలా మంది ఉన్నారు.వారితో పోలిస్తే రాజమౌళి కాస్త వెనుక పడ్డాడు.కేవలం 5 మంది మాత్రమే నామినేషన్స్ లో నిలిచారు.మన రాజమౌళి యొక్క స్థానం ఆరు లేదా ఏడు అయ్యి ఉంటుంది.అందుకే తృటి లో మన రాజమౌళి యొక్క నామినేషన్స్ చేజారాయి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో రాజమౌళి కి ఆస్కార్ నామినేషన్స్ సొంతం కాక పోవడం పట్ల పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

నాటు నాటు పాట కి నామినేషన్ దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు.చిత్ర సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అయినా రాజమౌళి ఉత్తమ దర్శకుడి గా ఆస్కార్ నామినేషన్స్ ని మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube