కాకినాడ జిల్లా పిఠాపురంలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన తీవ్ర కలకలం చెలరేగింది.కొన్ని రోజుల క్రితం పిఠాపురంలో అద్దెకు దిగిన దంపతులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
గత కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించిన భార్యాభర్తలు ఓ మహిళ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.ప్రభావతి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించి.
కత్తితో బెదిరించి 150 గ్రాముల బంగారాన్ని దోపిడీ చేశారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగ భార్యాభర్తల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







