అయోమయంలో పడ్డ హీరో శ్రీకాంత్ కెరియర్.. ఆ ఒక్క సినిమానే దిక్కు

ఫ్యామిలీ సినిమాలతో హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ కూడా ఒకరు.కాస్త వయసు తిరగగానే ఇక హీరోగా పనికిరాడు అని కన్ఫామ్ చేసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు శ్రీకాంత్.

 Hero Srikanth Career Up And Downs Details, Srikanth, Hero Srikanth, Srikanth Cin-TeluguStop.com

ఆ దోవలోనే పలు చిత్రాల్లో నటించిన ఇప్పటి వరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేదని చెప్పాలి.గతంలో జగపతిబాబు సైతం ఫ్యామిలీ సినిమాల్లో నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే జగపతిబాబు తరహాలోనే శ్రీకాంత్ సైతం ప్రయత్నాలు చేస్తున్న ఆనవాలు కనిపించడం లేదు.

శ్రీకాంత్ జగపతిబాబు ఇద్దరూ కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు.ఆ తర్వాత మాస్ పాత్రలలో కూడా కనిపించారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు.కానీ జగపతిబాబు చేసిన ప్రయోగం సక్సెస్ అయినప్పటికీ శ్రీకాంత్ కి ఎందుకో వర్క్ అవుట్ అవ్వట్లేదు.

ప్రస్తుతం శ్రీకాంత్ పరిస్థితి చూస్తుంటే ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా మారింది.

Telugu Akhanda, Srikanth, Hunt, Jagapathi Babu, Rc, Srikanthcine, Srikanth Offer

యుద్ధం శరణం గచ్చామి అనే సినిమాతో పూర్తిస్థాయి విలన్ గా శ్రీకాంత్ నటించి మలయాళం లో విలన్ అనే సినిమా మరియు కన్నడ లో ది విలన్ అనే సినిమాలో అవకాశాలు సంపాదించాడు.ఆ తర్వాత బాలకృష్ణతో అఖండ సినిమాలో విలన్ కి అసిస్టెంట్ పాత్రలో నటించి అందరి ఆశలపై నీళ్లు చల్లాడు శ్రీకాంత్.ఈ సినిమా సక్సెస్ అయినా కూడా క్రెడిట్ ఏ మాత్రం రాలేదు శ్రీకాంత్ కి.

Telugu Akhanda, Srikanth, Hunt, Jagapathi Babu, Rc, Srikanthcine, Srikanth Offer

ఇక కేవలం విలన్ గా ఉంటే సరిపోదని హీరోకి అన్నయ్య పాత్రలో కూడా నటిస్తూ వచ్చిన అది కూడా సెట్ అవ్వలేదు.ప్రస్తుతం హంట్ అని ఒక సినిమాలో నటిస్తున్నప్పటికీ ఇది సక్సెస్ అయితే తప్ప శ్రీకాంత్ కెరియర్ గందరగోళం లో పడకుండా ఉంటుంది.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న శంకర్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు.ఇలా వరుస సినిమాలు వచ్చి శ్రీకాంత్ కి మంచి పాత్రలు క్లిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube