స్టార్ హీరో బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ విజయోత్సవ సభలో ఏకంగా అరగంట పాటు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.నాది నిఖార్సైన విజయం అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఎవరి గురించి వాళ్లు నేనంటే ఇదీ అని చెప్పుకునే సత్తా, ధైర్యం చాలా తక్కువమందికి ఉంటుందని బాలకృష్ణ కామెంట్లు చేశారు.అలా చెప్పడం కూడా అందరికీ అతకదని బాలయ్య చెప్పుకొచ్చారు.
దానికొక నిఖార్సు ఉండాలని నిజాయితీతో కూడిన గర్జన ఇదీ అని బాలయ్య చెప్పుకొచ్చారు.సింహం గర్జిస్తే ఎలాంటి గర్జన ఉంటుందో అలాంటి గర్జన ఇదీ అని బాలయ్య కామెంట్ చేశారు.
ఆ గర్జన నిఖార్సు, నిజాయితీతో ఉండాలని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.నిఖార్సు, నిజాయితీ ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నానని బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాలను, ఆ సినిమాల కలెక్షన్లను ఉద్దేశించి బాలయ్య ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య చేసిన కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.బాలయ్య తన స్పీచ్ లో జగన్ సర్కార్ పై సెటైర్లు వేయడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుండగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య తన స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా బాలయ్య హరీష్ శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది.







