డబ్బే డబ్బును సంపాదిస్తుంది.అవును మన దగ్గర ₹100 ఉంటే ఆ 100కు ఇంకొక 100 రూపాయలు జత చేయడం పెద్ద పని కాదు కానీ మొదటి వంద రూపాయలు సంపాదించడమే అతి కష్టమైన పని ఈ విషయం షారుఖ్ ఖాన్ ని చూస్తే మనకు అర్థమవుతుంది.
ప్రస్తుతం ప్రపంచంలోని నటీనటులకు సంబంధించి నాలుగవ ప్రపంచ ధనవంతుడు షారుక్ ఖాన్.అతడి ఆస్తుల విలువ దాదాపు 7వేల కోట్లు.
తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న లేదా బ్యాన్ చేసిన అతనికి జరిగే నష్టం పెద్దగా ఏమీ లేదు.అలాగే తన కొడుకుని ఇలాంటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి ఇరికించినా కూడా జరిగేది ఏమీ లేదు.

ప్రపంచ కుబేరులు జాబితాలో షారుక్ ఖాన్ కి గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు పెరిగాయి.షారుక్ నివసిస్తున్న నివసిస్తున్న మన్నత్ ఇల్లు అలాగే లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు లాంటివి మనమ్మ కళ్ళ ముందు కనిపిస్తున్న అవన్నీ కూడా ఆయనకు అతి అల్పమైన ఆస్తులే.మరి షారుక్ మాత్రమే ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు ? ఓ పక్క సినిమాలు మరో పక్క బ్రాండ్ ఎండార్స్మెంట్ లు అవి కాకుండా ఐపిఎల్ తో షారుక్ కుబేరుడిగా ఎదుగుతున్నాడు.మరి అమితాబచ్చన్ కుటుంబం విషయాన్నికొస్తే అమితాబ్, జయ బాధూరి, అభిషేక్, ఐశ్వర్య ఇలా అందరూ సంపాదిస్తున్న షారుక్ కి దరిదాపుల్లో కూడా లేరు.

సల్మాన్ ఖాన్ అమెరికన్ లాంటివారు కూడా ఆయనను చేరుకోవాలంటే ఇంకో పదేళ్లు ఆగాల్సిందే.అందుకే సల్మాన్ ఖాన్ ఇక సినిమాలు చెయ్యకపోయినా జరిగే నష్టమేమీ లేదు.షారుక్ డబ్బే మరింత డబ్బులు పెంచుతుంది.ఇక షారుక్ సంపాదిస్తున్న ఆస్తులపై ఈడి కన్ను కూడా పడింది ఆ మధ్య దాడులు చేసి కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్న అవి దూదిపింజ తో సమానం.
మరి మన తెలుగు హీరోలు ఏమైనా అటువైపు ఆలోచిస్తున్నారా ? షారుక్ లాంటి హీరోల దరిదాపుల్లోకి వెళ్లే అవకాశం ఉందా? కాస్త లుక్ వేయండి గురు.







