కరోనా తరువాత దేశంలో కొన్ని విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.అందులో ముఖ్యమైన అంశం వాహనాలు.
ఇండియాలో పెరిగిపోతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా భారీగానే పెరిపోతున్నాయి.తద్వారా పర్యావణ కాలుష్యం అనేది ఇక్కడ తీవ్ర రూపాన్ని దాల్చుతోంది.
అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జనాలు, పెరిగిపోతున్న ఇంధన ధరలను తాళలేక పెట్రోల్, డీసెల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తే డబ్బుని ఆదాచేసుకోవచ్చు కదాని ఆలోచన చేసారు.దాంతోనే మనదగ్గర EVల వినియోగం భారీగా పెరిగింది.

అవును, ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి.అయితే ఇలాంటి సమయాల్లోనే కస్టమర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలి.లేదంటే డెబ్బైపోతారు.అందుకనే మీకోసమే ఇక్కడ ఇండియాలోనే లభ్యమౌతున్న టాప్ 5 వెహికల్స్ గురించి సమాచారం ఇస్తున్నాం.బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ సంస్థ ‘బౌన్స్’ (Bounce) ‘ఇన్ఫినిటీ E1’ (Infinity E1) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇటీవలే విడుదల చేసింది.వీటి ధరలు వరుసగా రూ.68,999 మరియు రూ.45,099 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా ఇవి ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్) పరిధి వరకూ ప్రయాణిస్తాయి.

ఇక రెండవది TVS ఐక్యూబ్.ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవాలి.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 3 వేరియంట్స్ లో మార్కెట్లో అందుబాటులో వుంది.ఇవి 3.04 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి.దీని తరువాత చెప్పుకోదగ్గది ఓలా ఎస్1.వీటి ధరలు రూ.99,999, రూ.1.40 లక్షలు మరియు రూ.84,999 (ఎక్స్-షోరూమ్)గా వున్నాయి.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఆ తరువాత మార్కెట్లో వున్న బెస్ట్ ఆప్షన్ ఏథర్ 450ఎక్స్.వీటి ధరలు రూ.1.58 లక్షలు మరియు రూ.1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు)గా వున్నాయి.వీటి పూర్తి ఫీచర్లు కావాలంటే సంబంధిత సైట్స్ సందర్శించగలరు.








