సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది మళ్ళీ షూటింగ్స్ కి కళ వచ్చింది.సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయం సాధించడంతో మిగతా చిత్ర బృందాలన్నీ కూడా హుషారులో ఉన్నాయి.
స్టార్ అల్లు అర్జున్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరూ షూటింగ్ మూడ్ లోకి వెళ్లిపోయారు.దాంతో స్టార్ హీరోల అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించడంతో భోళా శంకర్ షూటింగ్ లో ఆ హడావిడి బాగా కనిపిస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి ఈ షూటింగ్ మొదలుపెట్టి త్వరగా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.
ఇక చిరంజీవి జనవరి 17న షూటింగ్ మొదలుపెట్టడానికి సెట్ లోకి వెళ్లడంతో అక్కడ యూనిట్ అంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చేశారు.కలకత్తాలోని కాళీ సెట్లో షూటింగ్ ప్రారంభం కాక ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది.

డిసెంబర్లో మూడు నాలుగు రోజులపాటు షూటింగ్ జరుపుకున్న పుష్ప సీక్వెల్ వైజాగ్ లో మళ్ళీ పునః ప్రారంభమైంది.ఈ సినిమాని 2024లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుండగా అందుకోసం శర వేగంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.సూపర్ స్టార్ క్రిష్ణ మరణంతో మహేష్ బాబు కాస్త సైలెంట్ అయినా విషయం మనకు తెలిసిందే.అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఆయన షూటింగ్ లో పాల్గొనడం జరిగింది.
ఈ విషయం తెలిసి ఆయన అభిమానులంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా సారథి స్టూడియోలో జరుగుతున్నాయి.

ధమాకా మరియు వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న రవితేజ సినిమా రావణాసుర.ఈ సినిమా కోసం ఫరియ అబ్దుల్లా పై ఒక మాస్ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.రావణాసుర సినిమా కోసం రవితేజ లాయర్ పాత్రుల్లో కనిపిస్తుండగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.







