బాలీవుడ్ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలయింది.అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ సాలిడ్ సక్సెస్ సొంతం చేసుకోలేక పోయింది.
ఓటీటీ సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న జాన్వీ కపూర్ కి తెలుగులో మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది .ఇటీవల ఒక స్టార్ హీరో కి జోడి గా తెలుగు లో నటించేందుకు గాను ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట నిర్మాతలు.ఇంత భారీ పారితోషికం ఒక ఫెయిల్యూర్ హీరోయిన్ కి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది అంటూ చాలా మంది ఫిలిం మేకర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.కేవలం శ్రీదేవి కూతురు అనే కారణం తోనే జాన్వీ కపూర్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హిందీలో పెద్దగా ఆకట్టుకోలేక పోయినా వరుసగా ఫ్లాప్స్ మూట కట్టుకుంటున్నా కూడా జాన్వీ కపూర్ ని తెలుగు ఫిలిం మేకర్స్ తెగ ఇష్టపడుతున్నారు.కేవలం ఫిలిం మేకర్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఆమెను ఇష్టపడతారని నమ్మకం వారు వ్యక్తం చేస్తున్నారు.అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సినిమా ల్లో ఈమె ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ ఇద్దరు హీరో లకు జోడి గా జాన్వీ కపూర్ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒక్క సినిమా టాలీవుడ్ లో సక్సెస్ అయితే ఈమె యొక్క రెమ్యూనరేషన్ రెండు నుంచి నాలుగు కోట్ల కు పెరిగినా ఆశ్చర్యం లేదు.అలా ఉంది ఈమె యొక్క తెలుగు క్రేజ్.







