రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత పెళ్లి ముహూర్తం ఫిక్స్... అధికారకంగా ప్రకటించిన సుజాత!

బుల్లితెర ప్రేమ పక్షులుగా ఉన్నటువంటి రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ప్రేమ ప్రయాణం గురించి మనకు తెలిసిందే.జబర్దస్త్ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి స్కిట్లు చేస్తున్నడంతో కేవలం స్కిట్లు కోసమే ఇలా చనువుగా ఉన్నారని అందరూ భావించారు.

 Fix Rocking Rakesh Jordar Sujatas Wedding Moment Sujata Officially Announced,-TeluguStop.com

అయితే నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నారనే విషయాన్ని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.అయితే ప్రేమలో ఉన్నామని ప్రకటించిన ఈ జంట ఈ ఏడాదిలో తమ పెళ్లి జరగబోతుందని తెలిపారు.

అయితే సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ పెళ్ళి ఎప్పుడు అనే విషయాన్ని అధికారకంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ వీడియో ద్వారా మా ప్రేమ ప్రయాణం గమ్యానికి చేరింది అంటూ ఈమె ఒక వీడియో ద్వారా తమ పెళ్లి గురించి ప్రకటించారు.ఈ వీడియోలో భాగంగా రాకింగ్ రాకేష్ తో కలిసి తన పరిచయం ఎలా ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా మారడం ప్రేమకు దారి తీయడం చివరికి పెళ్లి వరకు ఎలా వెళ్ళిందనే అన్ని విషయాలను తెలియజేశారు.ఇక మా పెళ్ళికి పెద్దలు కూడా మా నిర్ణయాన్ని గౌరవించి ఒప్పుకున్నారని ప్రతి ఒక్క ఆడపిల్ల మంచి భర్త మంచి కుటుంబం రావాలని కోరుకుంటారు ఈ విషయంలో తాను అదృష్టవంతురాలిని అంటూ సుజాత ఈ సందర్భంగా తెలిపారు.

ఇక ఈనెల చివరిలో తన నిశ్చితార్థం జరుగుతుందని అదే రోజున పెళ్లికి లగ్న పత్రిక రాసి ముహూర్తం కూడా ప్రకటించబోతున్నట్లు ఈమె ఈ వీడియో ద్వారా తెలియజేశారు.ఇకపై మా రిలేషన్ గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు అంటూ సుజాత తన నిశ్చితార్థం పెళ్లి గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది బుల్లితెర నటీ నటులు జబర్దస్త్ కమెడియన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube