ప్రకాశం జిల్లాలో బోర్డు తిప్పేసిన హైస్కూల్..అంధకారంలో విద్యార్థుల భవిష్యత్..!

ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది.గిద్దలూరులో ఉన్న హైస్కూల్ ఒక్కసారిగా మూతపడింది.

దీంతో విద్యార్థులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.యాజమాన్యానికి, లీజుకు తీసుకున్న ఉపాధ్యాయులకు మధ్య వివాదం చెలరేగింది.

ఈ క్రమంలో స్కూల్ నిర్వహించలేమని పాఠశాల యాజమాన్యం చేతులెత్తేసిందని సమాచారం.కాగా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 16 మంది ఉన్నారు.

అదేవిధంగా యాజమాన్యం తీరుతో 213 మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇలా మధ్యలో స్కూల్ మూతపడితే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు