బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిన విషయం విదితమే.ఈ సినిమా తర్వాత ఈయన స్థాయి ఒక్కసారిగా పెరిగి పోయింది.
బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి తన స్టామినా బాలీవుడ్ లో చూపించాడు.ఈ సినిమా తర్వాత అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.
ప్రెజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఒక్కో సినిమాకు ఒక్కో రకం అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాలే కాకుండా మారుతి సినిమా, ఇంకా సురేందర్ రెడ్డితో స్పిరిట్ సినిమా కూడా ప్రకటించాడు.ఇలా భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు క్షణం తీరిక లేకుండా వరుస షూటింగులతో బిజీ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాల్లో ఆదిపురుష్ ప్రెజెంట్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుపు కుంటుంది.
ఇందులో ఒక్క స్పిరిట్ మాత్రమే ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.మిగిలిన సినిమాల షూటింగులు శరవేగంగా జరుగు తున్నాయి.ఇలా ఇన్ని సినిమాలు పూర్తి చేస్తున్న సరే ఈయన తర్వాత చేయబోయే సినిమాలపై ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
ఇక గత కొన్ని రోజులుగా డార్లింగ్ లైనప్ పై మరింత సాలిడ్ సమాచారం బయటకు వచ్చింది.ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు ఈయన చేస్తున్నాడు అని టాక్ వస్తుంది.
తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మరింత మాస్ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు అని టాక్.వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో మరొక భారీ మూవీ సెట్ చేసుకున్నాడట.ఇంకా దిల్ రాజు బ్యానర్ లో కూడా మరొక సినిమాను ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేయనున్నాడు అని రావణం అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది.చూడాలి ఈ మాస్ లైనప్ ఎప్పటికి సెట్స్ మీదకు వెళుతుందో.