తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘కంటి వెలుగు’ పథకం గిన్నిస్ రికార్డ్ సృష్టించడం ఖాయమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.ఇప్పటికే గిన్నిస్ బుక్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కంటి వెలుగు పథకం అమలుపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే పథకాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు.అంధత్వ రహితంగా తెలంగాణను మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.