ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు.తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్ కల్పించుకుని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లంచేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.అదేవిధంగా పలు సమస్యలను గవర్నర్ బీబీ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అనేక సార్లు విన్నవించినా, అనేక సమావేశాల్లో డిమాండ్ చేసినా ఫలితం శూన్యమని వాపోయారు.
ఈ క్రమంలోనే గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు.దేశ చరిత్రలో తొలిసారి ఉద్యోగులు బకాయిల కోసం పోరాడుతున్నారని వెల్లడించారు.