సమంత శాకుంతలం సినిమా తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.గుణ శేఖర్ స్వీయ దర్శకత్వం లో శాకుంతలం సినిమాను నిర్మించాడు.
దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
సమంత కూడా ప్రెస్ మీట్ కు హాజరు అయ్యింది.ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు గుణశేఖర్ మరియు సమంత కూడా కన్నీళ్లు పెట్టుకున్న నేపథ్యం లో అందరి దృష్టి ఆ ఈవెంట్ ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా సమంత కు ఈ సినిమా అత్యంత కీలకం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఎందుకంటే సుదీర్ఘ కాలపు కెరీర్ లో సమంత ఎన్నో సక్సెస్ లను దక్కించుకుంది.
కానీ పెళ్లి తర్వాత మాత్రం ఆమె యొక్క కెరీర్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.యశోద సినిమా వచ్చినప్పటికి కూడా ఆ సినిమా ఫలితం అటు ఇటు కాకుండా వచ్చింది.
ఇక శాకుంతలం సినిమా యొక్క ఫలితం పై అందరి దృష్టి ఉంది.ఈ సమయంలో శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ ను విడుదలకు దాదాపు నెలన్నర రోజుల ముందు విడుదల చేయడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ ను అప్పుడే విడుదల చేయడం ద్వారా శాకుంతలం సినిమా యొక్క క్రేజ్ ఆ సమయంలో పెంచడం కష్టం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి సినిమాకు ఇన్నాళ్ల ముందు ట్రైలర్ ను విడుదల చేసినా కూడా సమస్య లేదు.కానీ ఇంత ముందుగా శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయడం అనేది తప్పుడు నిర్ణయం అయ్యి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్రైలర్ విడుదల తర్వాత కంటిన్యూ గా సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరగాలి.
కానీ ఆ రోజు నుండి మళ్లీ శాకుంతలం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి కనిపించడం లేదు.అందుకే శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ ను కాస్త ఆలస్యంగా విడుదల చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
శాకుంతలం సినిమా విడుదలకు సరిగ్గా ఇంకా నెల రోజుల సమయం ఉంది.








