హైదరాబాద్ తార్నాకలో కుటుంబం అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.జూపాలి అపార్ట్ మెంట్ లో నలుగురు మరణం వెనుక కారణంపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇందులో భాగంగా కాల్స్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.కుటుంబ కలహాలు కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
చెన్నైకి చెందిన ప్రతాప్, ఆయన భార్య సింధూర, నాలుగేళ్ల కుమార్తె ఆధ్యతో పాటు ప్రతాప్ తల్లి రజిత మృతదేహాలను నిన్న అనుమానాస్పద స్థితిలో అపార్ట్ మెంట్ లో గుర్తించారు.కాగా మృతుడు ప్రతాప్ చెన్నైలోని ఓ కార్ల షోరూమ్ లో డిజైనర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.
ప్రతాప్ ఉరి వేసుకుని చనిపోగా మిగతా ముగ్గురు మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు.ఈ నేపథ్యంలో తల్లి, భార్య, కూతురిని హత్య చేసిన ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.? లేదా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.