నటసింహం నందమూరి బాలయ్య హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో మంచి క్రేజ్ సంపాదించడం తెలిసిందే.గత ఏడాది ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రారంభమైన ఈ షో.
రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది.దేశంలో అన్ని టాకీ షోలలో టాప్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం సెకండ్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మొదటి సీజన్ లో అందరూ సెలబ్రిటీలు రాగా సెకండ్ సీజన్ లో… సినిమా సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరి కొంతమంది రాజకీయ నేతలు ఇప్పటికే వచ్చారు.అయితే ఈ షోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని పేర్కొన్నారు.కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ల తర్వాత షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంత్రి రోజా స్పష్టం చేశారు.







