యువ హీరో కార్తికేయ ప్రస్తుతం బెదురులంక 2012 సినిమా చేస్తున్నాడు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నారు.
డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.
ఇక ఈ సినిమా కార్తికేయ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ చేసింది.అయితే అది తెలుగు రాష్ట్రాల్లో కాదు యూఎస్ లో.కార్తికేయ బెదురులంక 2012వ సినిమా యూఎస్ లో 80 లక్షల దాకా రేటు పలికింది.ది విలేజ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కార్తికేయ సినిమా రైట్స్ కొనేసింది.
ఆరెక్స్ 100తో హిట్ అందుకున్న కార్తికేయ మళ్లీ కెరీర్ లో అలాంటి హిట్ కొట్టలేదు.తన ప్రయత్నాలు తాను చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం రావట్లేదు.తన హోప్స్ అన్ని కూడా ఈ బెదురులంక 2012 మీద పెట్టుకున్నాడు కార్తికేయ.మరి యూఎస్ లో కెరీర్ బెస్ట్ బిజినెస్ జరుగగా అక్కడ ఈసారి టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ సినిమాకు ఇంకాస్త మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
మరి కార్తికేయ అనుకున్న విధంగా ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.