పీలేరు సబ్ జైల్ లో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.పెద్దిరెడ్డి పని అయిపోయిందని ప్రజలే బుద్ధి చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎల్లో మీడియా కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు భవిష్యత్తునీ ప్రజలు ఎప్పుడో చించేసారని మండిపడ్డారు.
చిత్తూరులో చంద్రబాబు పోటీ చేసే పరిస్థితి లేదని కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.ప్రజల సంక్షేమం కోసం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు.
కావాలని ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేయటం చంద్రబాబు అజెండా అని ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికలలో కుప్పంలో టీడీపి జెండా పీకేయడం గ్యారెంటీ అని… వైసీపీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు.
ఇక ఈసారి ప్రజలు చంద్రబాబుకి రాజకీయ సమాధి కడతారు.ఏపీలో ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారు.
చంద్రబాబు ఏడుపు లను ప్రజలు ఎవ్వరు నమ్మరు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.