స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) యొక్క క్రేజ్ మార్కెట్లో నిరంతరం పెరుగుతోంది, అటువంటి పరిస్థితిలో, వాహన తయారీదారులు కూడా ఈ విభాగంలో నిరంతరం కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నారు.డిసెంబర్ 2022లో అత్యధికంగా అమ్ముడైన SUVల జాబితా కూడా తెరపైకి వచ్చింది.
అంటే ఆయా మోడళ్లకు మార్కెట్‌లో చక్కటి విక్రయాలు సాగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.ప్రజలు మెచ్చే కార్లకు డిమాండ్ ఉంటుంది.వాటి విక్రయాలు బాగుంటాయి.2022 డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 3 స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) వాహనాలను చూద్దాం.

హ్యుందాయ్ క్రెటా కారు డిసెంబర్ 2022లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ కార్లలో మొదటి స్థానంలో నిలిచింది.2021 డిసెంబర్‌లో 7609 కార్లు అమ్ముడైతే 2022 డిసెంబర్‌లో 10,205 కార్లు విక్రయించబడ్డాయి.అత్యధికంగా డిసెంబర్ నెలలో ఎస్‌యూవీ కార్లలో గ్రాండ్ విటారా బ్రెజా 2వ స్థానంలో నిలిచింది.ఈ మోడల్ 6171 కార్లు అమ్ముడయ్యాయి.మూడవ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది.ఈ కారు 2021 డిసెంబర్‌లో 4012 కార్లు విక్రయించబడ్డాయి.
అదే 2022 డిసెంబర్ లో మాత్రం 5,995 కార్లు అమ్ముడయ్యాయి.అయితే కొన్ని కార్లు మాత్రం అస్సలు విక్రయాలు జరగలేదు.
వాటి మోడళ్లను కూడా తెలుసుకుందాం.సుజుకి ఎస్ క్రాస్ కారు మోడల్ 2021 డిసెంబర్ నెలలో 1521 కార్లు అమ్ముడయ్యాయి.2022 డిసెంబర్ లో మాత్రం ఒక్క కారు కూడా అమ్ముడు పోలేదు.కిక్స్ కారు పరిస్థితి కూడా ఇంతే.డిసెంబరులో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు.2021 డిసెంబర్ నెలలో 130 కార్లు అమ్ముడయ్యాయి.రేనాల్ట్ డస్టర్ కారు పరిస్థితి కూడా ఇంతే.ఇవి కూడా డిసెంబర్ 2022లో ఒక్క కారు కూడా సేల్ అవలేదు.2021 డిసెంబర్ నెలలో 56 కార్లు అమ్ముడయ్యాయి.దీంతో ఈ మూడు మోడళ్లకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.







